IPL: టాస్ గెలిచిన రాజస్థాన్.. పంజాబ్‌తో అమీతుమీ

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్.. పంజాబ్‌తో అమీతుమీ
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్‌లో హెడ్ టూ హెడ్ చూస్తే ఇరు జట్లు 27 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో పంజాబ్ 11 సార్లు గెలవగా, రాజస్థాన్ 16 సార్లు విజయం సాధించింది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడ్డగా ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్బుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో రెండ స్థానంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్ ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్ పంజాబ్ నమా మాత్రం కోసమే ఈ మ్యాచ్ ఆడనుంది. ఈమ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిస్తే ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.

జట్టు వివరాలు

రాజ‌స్థాన్ రాయల్స్ జట్టు: య‌శ‌స్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీప‌ర్), రియాన్ ప‌రాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, రొవ్‌మ‌న్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శ‌ర్మ‌, య‌జ్వేంద్ర చాహ‌ల్.

పంజాబ్ కింగ్స్ జట్టు: జానీ బెయిర్‌స్టో, సామ్ క‌ర‌న్(కెప్టెన్), రీలే ర‌స్సో, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, అశుతోష్ శ‌ర్మ‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, క‌గిసో ర‌బ‌డ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష్‌దీప్ సింగ్.

Tags:
Next Story
Share it