Road Accident: ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ఆరుగురు సజీవ దహనం

ఏపీ (ap) గుంటూరు జిల్లాలో (gurtur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుని (travels bus) టిప్పర్ లారీ (tipper lorry) ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident: ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ఆరుగురు సజీవ దహనం
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ (ap) గుంటూరు జిల్లాలో (gurtur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుని (travels bus) టిప్పర్ లారీ (tipper lorry) ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీ వెళ్లి తిరిగి వస్తుండగా చిలకలూరిపేట (chilkaluripet) మండలం పసుమర్రు గ్రామం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సుని ఓ టిప్పర్ లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు మంటల్లో సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలయినట్లు అధికారులు తెలిపారు. అధికారులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it