Sara Alikhan: 'ఏ వతన్ మేరే వతన్' నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను వ‌ర‌ల్డ్ రేడియో డే సంద‌ర్భంగా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.

Sara Alikhan: ఏ వతన్ మేరే వతన్ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
X

న్యూస్ లైన్ సినిమా: బాలీవుడ్ యాక్టర్ సారా అలీఖాన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాకు కణ్ణన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక షుటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను వ‌ర‌ల్డ్ రేడియో డే సంద‌ర్భంగా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక గ్లింప్స్ కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. క్విట్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న‌ట్లు తెలుస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో క‌మ్యూనిటి రేడియో స్టేషన్‌ల‌ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఉషా మెహతా అనే మహిళ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తునట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇమ్రాన్‌ హష్మి, సచిన్‌ ఖేడ్కర్‌, అభయ్‌ వర్మ, స్పార్ష్‌ శ్రీవాత్సవ, అలెక్స్‌ ఓ నేలి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు నటిస్తున్నారు. నాటి స్ఫూర్తికథలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో రేడీయో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ రేడీయో దినోత్సవం సందర్భంగా మార్చి 21న స్ట్రీమింగ్‌ కవడం సంతోషంగా ఉందాని కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది.

Tags:
Next Story
Share it