Harish Rao: కరెంటు కోతలను అరికట్టాలనే చిత్తశుద్ధి సీఎంకు లేదు

సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మానుకొని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హయాంలో లాగా 24 గంటల కరెంట్ అన్ని రంగాలకు సరఫరా చేయాలని సూచించారు.

Harish Rao: కరెంటు కోతలను అరికట్టాలనే చిత్తశుద్ధి సీఎంకు లేదు
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కరెంటు కోతల(Current cuts)ను అరికట్టాలని చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy)కి లేదంటూ మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) ట్వీట్(Tweet) చేశారు. కరెంట్ కోతల విషయంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, కరెంట్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండించారు.

BRS ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని గుర్తుచేశారు. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను BRS నిలిపిందని తెలిపారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని హరీష్ రావు తన ట్వీట్ ద్వారా తెలిపారు. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మానుకొని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హయాంలో లాగా 24 గంటల కరెంట్ అన్ని రంగాలకు సరఫరా చేయాలని సూచించారు. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉంటున్నారని.. వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిదని హరీష్ రావు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it