KTR: రైతులకు బోనస్ ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వదిలేదిలేదు

కామారెడ్డిలో మంగళవారం రైతులు రెడ్డొక్కి ధర్నా చేశారని.. బుధవారం భావనగిరిలో ఆకుతోటబావి తండా గిరిజన రైతులు కలెక్టరేట్ ఆందోళన చేశారని గుర్తుచేశారు.

KTR: రైతులకు బోనస్ ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వదిలేదిలేదు
X

న్యూస్ లైన్ డెస్క్: రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్(bonus) ఇచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. ఈరోజు నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో రైతులు ధర్నాలు చేయల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. కామారెడ్డిలో మంగళవారం రైతులు రెడ్డొక్కి ధర్నా చేశారని.. బుధవారం భువనగిరిలో ఆకుతోటబావి తండా గిరిజన రైతులు కలెక్టరేట్ ఆందోళన చేశారని గుర్తుచేశారు. అటు సిరిసిల్ల మల్కపేట, నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిహత హామీలను ప్రజలంతా విన్నారని తెలిపారు. జఫాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా DSC అని చెప్పి యువతను దగా చేశారని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ పాలనను అందరూ చూశారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తాను ఇచ్చానని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడిన కేటీఆర్.. ల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచామని గుర్తుచేశారు. ఈసారి ఎన్నికల బరిలో విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని నిలబెట్టామని తెలిపారు. విద్యావంతులైన ఓట్లార్లంతా సరైన నిర్ణయం తీసుకొని ఆయనను గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఈ సమావేశానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

Tags:
Next Story
Share it