Triple-Star System: త్రిన‌క్ష‌త్ర కూట‌మి.. సూర్యుడి లాగా మారనున్న కొత్త నక్షత్రం..!

దీని వయసు 10 మిలియ‌న్ల సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

Triple-Star System: త్రిన‌క్ష‌త్ర కూట‌మి.. సూర్యుడి లాగా మారనున్న కొత్త నక్షత్రం..!
X

న్యూస్ లైన్ డెస్క్: అంతరిక్షం(space)లోని నెబ్యూలా(Nebula) నుంచి ఓ త్రిన‌క్ష‌త్ర కూట‌మి (Triple-Star System) ఏర్పడింది. భూమికి సుమారు 550 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఈ కూటమి ఉన్నట్లుగా నాసా(NASA) తెలిపింది. తాజాగా, దీనికి సంబంధించిన ఫోటో(Photo)ను కూడా విడుదల చేసింది. ఈ త్రినక్షత్ర కూటమిలో ఉన్న నక్షత్రాలకు హెచ్‌పీ టౌ (HP tou), హెచ్‌పీ టౌ జీ2, హెచ్‌పీ టౌ జీ3గా నాసా పేర్కొంది. ఈ న‌క్ష‌త్ర కూట‌మి సొంతంగా కాంతిని ఇవ్వనప్పటికీ, భారీ ఆకాశ అద్ధంలా ప‌నిచేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఇందులో అతిచిన్నదైన హెచ్‌పీ టౌ నక్షత్రానికి సూర్యుడి తరహాలో మారే సామర్ధ్యం ఉన్నట్లు నాసా తెలిపింది. దీని వయసు 10 మిలియ‌న్ల సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఈ నక్షత్రాలను అధ్యయనం చేయడానికి శాస్త్ర‌వేత్త‌లు హబ్బుల్ టెలిస్కోప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రోటోప్లానెటరీ డిస్క్‌లు, మిలియన్ల సంవత్సరాలలో గ్రహాలుగా ఏర్పడే నక్షత్రాల చుట్టూ ఉన్న పదార్థాల డిస్క్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

Tags:
Next Story
Share it