Vinod Kumar: కరీంనగర్‌ని స్మార్ట్ సిటీగా చేసింది నేనే..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ జిల్లాలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు.

Vinod Kumar: కరీంనగర్‌ని స్మార్ట్ సిటీగా చేసింది నేనే..
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇవాళ జిల్లాలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజా సమస్యలపై గళమెత్తే వాడిని నేనే. ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపాలన్నారు. మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ చేశాను. రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశాను. రూ.50 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయించాను. కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ బడి తేలేదు.. గుడి తేలేదని విమర్శించారు. కరీంనగర్‌కు మంజూరైన ట్రిబుల్ ఐటీ బండి సంజయ్ అసమర్థత కారణంగా ఇతర రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరలించిందన్నారు. ఐదేళ్లలో ఊరు ముఖం చూడని బండి సంజయ్‌కి ఇప్పుడు ప్రజలు గుర్తుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బండి సంజయ్ తెచ్చినట్లు ప్రగల్బాలు పలుకుతున్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ మళ్ళీ ఒక్కటవుతున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఈసారి ఎన్ని కుట్రలు చేసిన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఘనవిజయం సాధిస్తానన్నారు.” ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it