Kharge: జూన్ 4న అధికారంలోకి వచ్చేది మేమే..

ఒకవేళ ఎన్నికలు జరిగినా.. మోడీ పాలనలో దళిత, గిరిజన, ఓబీసీ, మహిళ అభ్యర్థులు అసలే ఉండరని ఖర్గే తెలిపారు.

Kharge: జూన్ 4న అధికారంలోకి వచ్చేది మేమే..
X

న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 4న అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge) ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని మహారాజ్ గంజ్(Maharaj Gunj)లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వీరేంద్రచౌధరీ(Virendra Choudhry) తరఫున ప్రచారం చేసిన ఆయన బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను మోడీ నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికలు జరిగినా.. మోడీ పాలనలో దళిత, గిరిజన, ఓబీసీ, మహిళ అభ్యర్థులు అసలే ఉండరని ఖర్గే తెలిపారు. 70ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఆరోపిస్తున్న మోడీ.. ఆయన అధికారంలో ఉండగా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రూపుమాపాలని బీజేపీ ప్రయత్నిస్తుందని..కానీ, అది ఎప్పటికీ జగదని ఖర్గే వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it