AUS vs WI: వార్నర్‌ పోరాడినా... ఆఖరి టీ20 విండీస్‌దే!

ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ ఓ మంచి విజయంతో ముగించింది.

AUS vs WI: వార్నర్‌ పోరాడినా... ఆఖరి టీ20 విండీస్‌దే!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ ఓ మంచి విజయంతో ముగించింది. గబ్బా టెస్టులో విజయం తర్వాత ఆ జట్టుకు ఇది సెకండ్‌ విక్టరీ. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో కరేబియన్‌ బ్యాటర్ బాగా రాణించడంతో విజయని అందుకున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌.. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో విండీస్‌ 37 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

పెర్త్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ఓపెనర్ టాపార్డర్‌ వైఫల్యంతో 8.4 ఓవర్లలో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెర్ఫేన్‌ రూతర్‌ఫర్డ్‌ 40 బంతుల్లో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు(5 ఫోర్లు, 5 సిక్సర్ల). ఆ తర్వాత క్రీజులో దిగిన విండీస్‌ విధ్వంసక బ్యాటర్ ఆండ్రీ రసెల్‌ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు. రసెల్‌, రూథర్‌ఫర్డ్‌లు ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ఇక ఛేదనలో ఆసీస్‌ కూడా దంచికొట్టింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (17), డేవిడ్‌ వార్నర్‌ 49 బంతుల్లో 81 పరుగులు ( 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. మార్ష్‌ త్వరగా ఔటైనా వార్నర్‌ మాత్రం విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో వికెట్‌కు ఆరోన్‌ హార్డీ (16)తో కలిసి 46 పరుగులు జోడించాడు. 25 బంతుల్లోనే వార్నర్ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో వార్నర్‌.. రోస్టర్‌ ఛేజ్‌ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్లో జోష్‌ ఇంగ్లిస్‌ (1) కూడా బోల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (12) ఏ మ్యాజిక్‌ చేయలేదు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌(41, నాటౌట్‌) పోరాడినా అతడి పోరాటం విండీస్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయింది.

Tags:
Next Story
Share it