Bournvita: బోర్న్‌విటాకు కేంద్రం భారీ షాక్

కేంద్ర ప్రభుత్వం ప్రముఖ హెల్త్‌డ్రింక్స్ ‘బోర్న్‌విటా’కు (bournavita) భారీ షాక్ ఇచ్చింది. బోర్న్‌విటాను హెల్త్‌డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందులో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని NCPCR పరిశోధనల్లో తేలింది. దీంతో బోర్న్‌విటాను హెల్త్‌డ్రింక్స్ కేటగిరి నుంచి తొలిగించానలని ఆదేశాలు జారీ చేసింది

Bournvita: బోర్న్‌విటాకు కేంద్రం భారీ షాక్
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రముఖ హెల్త్‌డ్రింక్స్ ‘బోర్న్‌విటా’కు (bournavita) భారీ షాక్ ఇచ్చింది. బోర్న్‌విటాను హెల్త్‌డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందులో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని NCPCR పరిశోధనల్లో తేలింది. దీంతో బోర్న్‌విటాను హెల్త్‌డ్రింక్స్ కేటగిరి నుంచి తొలిగించానలని ఆదేశాలు జారీ చేసింది.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (CPCR) చట్టం-2005లోని సెక్షన్ 3 కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవలే సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదని నిర్ధారణకు వచ్చినట్లు కేంద్రం ఏప్రిల్‌ 10 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బోర్న్‌విటా సహా కూల్‌డ్రింక్స్‌, బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి వెంటనే తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఎన్‌సీపీసీఆర్ సంస్థలను ఆదేశించింది.

Tags:
Next Story
Share it