IPL: ఉప్పల్ మ్యాచ్‌కు వర్షం గండం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది.

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌పై ఎఫెక్ట్ పడింది. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉల్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో స్టేడియం లోపల నీళ్లు నిల్వ ఉన్నాయి. హైదరాబాద్‌కు కీలకమైన మ్యాచ్ వర్షార్పణం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ నెగ్గితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. కాగా, ఇప్పటికే గుజరాత్ జట్టు ఐపీఎల్ లీగ్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. గంట తర్వాత రిపోర్ట్ ను బట్టి మ్యాచ్ పై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ఫ్యాన్స్ స్టేడియంకు భారీగా సంఖ్యలో వస్తున్నారు.

Tags:
Next Story
Share it