KTR condoles: శంకర్ యాదవ్ మరణం పట్ల కేటీఆర్ సంతాపం

కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన త్వరలోనే కోలుకుంటారని భావించానని కేటీఆర్ తెలిపారు. కానీ మరణిస్తారని ఊహించలేదని వెల్లడించారు.

KTR condoles: శంకర్ యాదవ్ మరణం పట్ల కేటీఆర్ సంతాపం
X

న్యూస్ లైన్ డెస్క్: BRS నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) సోదరుడు తలసాని శంకర్ యాదవ్(Thalasani Shankar Yadav) మృతి చెందారు. పార్టీ శ్రేణులతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శంకర్ యాదవ్ మృతిపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా, బోయిన్‌పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా వ్యాపారులకు మేలు చేసేందుకు ఆయనెంతో కృషి చేశారని గుర్తుచేశారు. కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన త్వరలోనే కోలుకుంటారని భావించానని కేటీఆర్ తెలిపారు. కానీ మరణిస్తారని ఊహించలేదని వెల్లడించారు. తలసాని కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Tags:
Next Story
Share it