Kulwant khejroliya: 4 బంతుల్లో 4 వికెట్లు.. కెజ్రోలియా సంచలనం!

మధ్య‌‌‌‌‌‌‌ప్రదేశ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్‌తో చరిత్ర సృష్ట్రించాడు

Kulwant khejroliya: 4 బంతుల్లో 4 వికెట్లు.. కెజ్రోలియా సంచలనం!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: మధ్య‌‌‌‌‌‌‌ప్రదేశ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్‌తో చరిత్ర సృష్ట్రించాడు. బోరోడాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్టు తీసుకొని ఆరుదైన రికార్డు ను నమోదు చేశాడు. మొత్తం 5 వికెట్లు పడగొట్టి మధ్య ప్రదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఐదు వికెట్‌లో హ్యాట్రిక్ కూడా ఉంది.

బరోడా ఫాలో ఆన్ ఆడుతున్న సమయంలో 95 ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. ఈ ఓవర్ 2,3,4,5 బంతుల్లో కెజ్రోలియా వరుసగా.. రావత్, మహేష్ పిథియా, భార్గవ్ భట్, ఆకాష్ సింగ్‌ల వికెట్లను పడగొట్టాడు. తిలి 11 ఓవర్లో ఒక్క వికెట్ కూడా పడకపోగా ఆ తర్వాత రెండు ఓవర్లలోనే 5 వికెట్లతో తన మ్యాజిక్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ 454 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బరోడా 132 పరుగులకే కుప్ప కూలింది. ఫాలో ఆన్ ఇవ్వడంతో మరోసారి బ్యాటింగ్‌కి దిగి 270 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇక కెజ్రోలియా ఐపీఎల్ విషయానికి వస్తే.. 2018, 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడడాడు. ప్రస్తుతం కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.

Tags:
Next Story
Share it