Koushik reddy: మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్

ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉందన్నారు.

Koushik reddy: మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్
X

న్యూస్ లైన్ డెస్క్: రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik reddy) ఆరోపించారు. శనివారం వే బిల్లు(Way bill) లేకుండా అధిక లోడ్ రూల్(Over load rule) ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీ(Fly ash lorries)లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం NTPC నుంచి ఖమ్మం వైపు వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. మంత్రి కనుసనల్లోనే ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు. ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కాంను లైవ్‌లో పట్టుకున్నామని తెలిపారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాలి అలాంటిది 70 నుంచి 100 టన్నుల వరకు తీసుకువెళ్తున్నారని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కోలారికి 40,000 వరకు ఉంటుందని రోజుకు రెండు నుంచి 300 లారీలు వెళ్తే సుమారు రూ.50 లక్షలు వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఇప్పటి వరకు 100 కోట్లు స్కామ్ చేసారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it