Russia: నదిలో పడిపోయిన బస్సు.. ఆరుగురు మృతి

రష్యాలో (Russia) ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు (bus) అదుపుతప్పి నదిలో (river) పడిపోయింది. ప్రమాదసమయంలో బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

Russia: నదిలో పడిపోయిన బస్సు.. ఆరుగురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: రష్యాలో (Russia) ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు (bus) అదుపుతప్పి నదిలో (river) పడిపోయింది. ప్రమాదసమయంలో బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.

అక్కడి స్థానికి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. “రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో (saint petersburg) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి వాహనాలను ఢీకొంటూ మొయికా నదిలో (moyka river) పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా మునిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నారు. పడవలలో బస్సులో ఉన్నవారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అందులో ఆరుగురు మృతి చెందగా.. మరో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ 20 గంటలకు పైగా పనిచేయడంతోనే, నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.”

Tags:
Next Story
Share it