Telangana: దొరా కాళ్ళు మొక్కుతాం వడ్లు కొనండి!

నీ కళ్ళు మొక్కుతాం వడ్లు కొనండి దొర అంటూ రైతులు (farmers) రేవంత్ రెడ్డిని (revanth reddy) వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్దవుతుంది.. దయచేసి వడ్లు కొనండని రైతులు అధికారులని వేడుకుంటున్నారు.

Telangana: దొరా కాళ్ళు మొక్కుతాం వడ్లు కొనండి!
X

న్యూస్ లైన్ డెస్క్: నీ కళ్ళు మొక్కుతాం వడ్లు కొనండి దొర అంటూ రైతులు (farmers) రేవంత్ రెడ్డిని (revanth reddy) వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్దవుతుంది.. దయచేసి వడ్లు కొనండని రైతులు అధికారులని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడం లేదని రైతులు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా భువనగిరి జిల్లా (bhuvanagiri) పరిధిలోని ఆకుతోటబావితండా (akkuthotabavitanda) గిరిజన రైతులు కలెక్టరేట్ (collectorate) ముందు ధర్నాకు దిగారు. తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తడిసిన ధాన్యం బస్తాలతో కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే.. రైతులు వారి కాళ్లు మొక్కుతూ.. తమ బాధలు తీర్చాలని వేడుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రానికి తీసుకొచ్చిన పంటను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలు మరీంతగా పెరిగిపోయాయి. రైతులు పంట పండించడమే పాపమైంది. నీరు లేక సగం పంట ఎండపెట్టుకొని.. ఉన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనేవారే లేరు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన పంటను అధికారులు కొన్నడం లేదని రైతులు చాలా చోట్ల ధర్నాకు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను అదుకోవాలని వారు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.

Tags:
Next Story
Share it