AP: ఏపీ ఎన్నికల పోలింగ్ శాతం ఎంతంటే..?

ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచామని తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు.

AP: ఏపీ ఎన్నికల పోలింగ్ శాతం ఎంతంటే..?
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని ఏపీ సీఈఓ ఎంకే మీనా(MK Meena) తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్‌ జరిగిందని తెలిపారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రం(Polling center)లో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్‌ పూర్తయిందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వర్షం కారణంగా కూడా పోలింగ్‌ ఆలస్యమైందని ఎంకే మీనా వెల్లడించారు. ఈవీఎం(EVM)లన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో(Strong rooms) భద్రపరిచామని తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు.

అనంతరం రెండు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న అల్లర్లపై ఆయన స్పందించారు. అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎంకే మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని అన్నారు. ప్రస్తుతం 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుందని ఎంకే మీనా తెలిపారు.

Tags:
Next Story
Share it